రిపబ్లికన్ అభ్యర్థిగా వివేక్ రామస్వామి!

36
- Advertisement -

త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి. రిపబ్లికన్ పార్టీ తరపున ఆయన బరిలో నిలవనున్నారు. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ వెల్లడించారు. రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున అధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీప‌డేందుకు రామస్వామి ఆస‌క్తిగా ఉన్నార‌ని త‌న ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వివేక్ రామ‌స్వామిపై మ‌స్క్ ప్ర‌శంస‌లు గుప్పించారు. ఫాక్స్ న్యూస్ యాంక‌ర్ ట‌క్క‌ర్ కార్ల్‌స‌న్‌తో జ‌రిగిన రామస్వామి సంభాష‌ణ‌ వీడియోను షేర్ చేస్తూ రామ‌స్వామి చాలా ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. గ‌తంలో డోనాల్డ్ ట్రంప్ ప్ర‌త్య‌ర్థిగా పోటీ చేసిన రాన్ డీసాంటిస్‌కు ఎల‌న్ మ‌స్క్ మ‌ద్ద‌తు ఇచ్చారు.

హార్వ‌ర్డ్‌, యేల్ యూనివ‌ర్సిటీల్లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు వివేక్ రామస్వామి. కేర‌ళ‌కు చెందిన భార‌తీయ దంపతులకు జన్మించారు.

Also Read:నోటి దుర్వాసనా..అయితే జాగ్రత్త!

- Advertisement -