నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా ఆడియో ఫంక్షన్ లో మంచు విష్ణు, నిఖిల్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. హీరో నిఖిల్ ఆహ్వానం మేరకు మంచు విష్ణు ఎక్కడిపోతావు చిన్నవాడా ఆడియో ఈవేంట్‌కు హాజరైయ్యాడు. స్టేజ్ మీదకి మాట్లాడటానికి వచ్చిన విష్ణు..తనకు సాధరణంగా స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడడం ఇష్టం ఉండదని..తనకు తన సినిమా ఆడియో వేడుకలకే వెళ్లడానికి చాలా మొహమాటం అని.. అలాంటపుడు బయటి ఆడియో వేడుకలంటే మరీ ఇబ్బంది పడతానని.. వేదికలెక్కి మాట్లాడటం తనకు ఆసక్తి ఉండదని మంచు విష్ణు తెలిపాడు. తనను ఎప్పుడూ ఆడియో వేడుకలకు పిలవొద్దని పేర్కోన్నాడు. తనకు ఆడియో ఫంక్షన్ కు వెళ్లడానికి మోహమాటం ఉన్నా,,,,ఇప్పుడు ఈ వేడుకకు హాజరు కావడానికి ఓ కారణం ఉందన్నాడు.
నాన్నగారు మోహన్ బాబు గారికి ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన వేడుకకు నిఖిల్‌ను పిలిస్తే 102 డిగ్రీల జ్వరం ఉండి కూడా హైదరాబాద్ నుంచి వైజాక్‌కు వచ్చాడు. దాని కృతజ్ఞతగా నిఖిల్ పిలువగానే నేనీ ఆడియో వేడుకకు వచ్చానన్నాడు. దానికి నిఖిల్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. మోహన్ బాబు గారి ఈవెంట్‌కి తనను పిలవడమే నాకు ఎక్కువ,,అప్పుడు మీరు నాకిచ్చిన గౌరవం, ప్రాధాన్యత ఎప్పటికీ మరచిపోలేను,,మీరు నా సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చినందుకు చాలా థాంక్స్..ఇకపై మిమ్మల్ని ఆడియో ఫంక్షన్‌కు పిలవనని అని చెప్పాడు. ఇలా వీరి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం విష్ణు,,నిఖిల్‌ను మాటల్లో పొగిడేశాడు. నాతో పాటు చాలామంది హీరోలకు ఇండస్ట్రీలో బ్యాకప్ ఉంది. మేం ఎంత కష్టపడినా.. మాకు మా ఫ్యామిలీ బ్యాకప్ ఉండటం మా అదృష్టం. కానీ నిఖిల్.. రాజ్ తరుణ్ లాంటి వాళ్లకు అలాంటి బ్యాకప్ అవసరం లేదు. వాళ్ల టాలెంట్.. వాళ్ల హార్డ్ వర్కే వాళ్లకు బ్యాకప్. ఏ బ్యాగ్రౌండ్ లేకున్నా హీరోలుగా నిలదొక్కుకున్నారు. అది గొప్ప విషయం. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చాలా వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుంది. దాని సక్సెస్ మీట్‌కు నేను వస్తాన్నాడు. ఇక ట్రైలర్ తోనే సినిమాని తప్పకుండా చూడాలనే ఇంప్రెషన్ కలిగించేసింది చిన్నవాడి టీం.