తెలంగాణ గడ్డపై… ఇందూరు బిడ్డకు ఘన స్వాగతం..

136
nikhat zareen
- Advertisement -

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ కు నేడు హదరాబాద్‌ లో ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. నిఖత్‌ జరీన్‌ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పేరుని ప్రపంచ దేశాలకు వినిపించేల చేసిన నిఖత్‌ జరీన్‌ ను ఘనంగా స్వాగతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేస్తున్నది. స్వయంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎయిర్‌పోర్టులో నిఖత్‌ జరీన్‌ కి స్వాగతం పలుకనున్నారు. 25 ఏళ్ల నిఖత్‌ జరీన్‌ తెలంగాణ లో ఇందూరు కి చెందిన వారు.

టర్కీ కాపిటల్ ఇస్తాంబుల్‌లో గురువారం జరిగిన వరల్డ్ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌లో ఫైనల్స్‌లో 52 కేజీల విభాగంలో నిఖత్‌ జరిన్‌ థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్‌ జిట్ పాంగ్‌ను 0-5తో చిత్తు గా ఓడించి గోల్డ్ మెడల్ (స్వర్ణా) ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మేరీకోమ్‌, సరితా దేవి, ఆర్ ఎల్ జెన్నీ, లేఖ తర్వాత ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న 5వ భారతీయ మహిళా బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌ క్యాతిని దక్కించుకున్నారు.

- Advertisement -