ఎన్‌హెచ్ఏఐ..సెన్సార్‌లో మార్పులు

34
- Advertisement -

పండుగలు వచ్చాయంటే రోడ్డు మీద విపరీతమైన రద్దీ సొంతూళ్లకు వేళ్లాలనే కోరిక కలుగుతుంది. కానీ ప్రతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ కష్టాలు అంతాఇంత కాదు. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్‌. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాలోని విజయవాడ, విశాఖ పట్నం లాంటి నగరాలకు ప్రయాణం అంటే అదొక నరకం. అలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సరికొత్త విధానంను అమలులోకి తీసుకువచ్చింది. అదే ఫాస్టాగ్… అయితే ఈ విధానం ద్వారా పండుగల సమయంలో ట్రాఫిక్ కష్టాలు తప్పడంలేదు. దీంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ముందడుగు వేసింది.

ఫాస్టాగ్ సమయంలో కార్లు బారులు తీరి లైన్లో వేచి ఉండకుండా ఫాస్టాగ్ సెన్సార్‌ల సమయంలో మార్పులు చేసేందుకు సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలోని టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్ సెన్సార్‌ల సమయంను తగ్గించేసింది. మూడు సెకెన్ల వ్యవధి కలగిన సెన్సార్‌లు కేవలం రెండు సెకన్ల కాలంలో మాత్రమే వాహనాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు నల్గొండ జిల్లా మీదుగా ఉన్న హైవేపై ఉన్న టోల్‌గేట్‌ల వద్ద అదనపు కౌంటర్లను ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. పండుగ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం వల్ల రాకపోకలు సాగే వాహనాలు సులువుగా టోల్‌గేట్‌లను త్వరగా దాటివేయగలవని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

ముగిసిన ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్‌..

సుడాన్‌కు యూఎన్‌ పీస్‌…

ఖరీదైన పిల్లిగా…స్కాటిష్‌ ఫోల్డ్‌ ఒలివియా

- Advertisement -