రాష్ట్రంలో 400 బ్రిడ్జిల నిర్మాణం- మంత్రి వేముల

197
Prashanth Reddy
- Advertisement -

నేడు మాదాపూర్ హైటెక్స్ లో లాంగ్ స్పాన్ బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ వర్క్ షాప్‌ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతిరెడ్డి పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యంత ఎక్కువ రోడ్లు కలిగిన భారతదేశం ప్రపంచంలో రెండోవది. రాష్ట్రంలో రోడ్ల విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

గత బడ్జెట్‌లో రోడ్ల నిర్మాణం కోసం 12వేల కోట్లు ఖర్చు చేసాం. అదేవిధంగా 400 బ్రిడ్జిల నిర్మాణం రాష్ట్రంలో జరుగుతుంది. గోదావరి, కృష్ణా, మంజీరా, మానేరు నదులపై బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది. రాష్ట్రంలో రెండు కేబుల్ స్టేర్ బ్రిడ్జిలు నిర్మాణం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఒకటి జిల్లాలో 220 కోట్ల రూపాయలతో దుర్గం చెరువుపై నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.

- Advertisement -