ఆకాశంలో అద్భుతం..@ 1-1-2018..!

265
- Advertisement -

2018 జనవరి 1న న్యూ ఇయరే కాదు..మరో స్పెషల్‌ డే కూడా ఉంది. అదే రోజు ఆకాశంలో అద్భుతం జరగబోతోందట. 2018 జనవరి 1న అతిపెద్ద చంద్రున్ని చూడబోతున్నామని ప్రకటించారు ఖగోళవేత్తలు.

డిసెంబర్ లో సూర్యుడికి చేరువలో భూమి వెళుతుందని చెబుతున్నారు. దీనివల్ల గురుత్వాకర్షణ ప్రభావంతో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తున్నాడని.. దీనివల్ల సూపర్ మూన్ ఆవిష్కారమవుతుందని తెలిపారు.

New Year to kick off with biggest SUPERMOON of 2018

జనవరి 1న ఆకాశంలో అద్భుతాన్ని చూడాలంటే.. టెలిస్కోప్ ద్వారా చూడొచ్చని చెబుతున్నారు. జనవరి ఒకటో తేదీ సాయంత్రం 5 గంటల నుంచి అవకాశం ఈ అద్భుతం ఉంటుందని తెలిపారు. భూమికి 3లక్షల 56వేల 565 కిమీ.ల దూరంలో చంద్రుడు వస్తున్నాడని లెక్కలు కట్టారు. ఆ రోజు సాధారణం కంటే 7 శాతం పెద్దగా చంద్రుడు కనిపించనున్నాడు. దీన్ని సూపర్ సైజ్డ్ మూన్ గా పిలుస్తున్నారు.

- Advertisement -