శృంగార తార..దేవిగా రాబోతుంది

264
Sunny Leone Movie Title Devi
- Advertisement -

శృంగార తార‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించిన సన్నీలియోన్.. ఈ మధ్య బాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో హాట్ హాట్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేస్తుంది. తనదైన శైలిలో అందాలను అస్సలు దాచుకోకుండా ఆరబోస్తూ కనువిందు చేస్తుంది. తాజాగా తెలుగులో రాజశేఖర్ నటించిన గరుడవేగ మూవీలోనూ ‘డియో.. డియో’ అంటూ ఐటమ్ బాంబ్ పేల్చింది. దీంతో తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించిన సన్నీ.. త్వరలోనే ఒక పూర్తిస్థాయి తెలుగు సినిమా చేయనుంది.

తెలుగుతో పాటు ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లోనూ కొన్ని పిరియాడిక్ ఫిల్మ్స్ సెట్స్ మీద ఉన్నాయి. ఈ జాబితాలో మ‌రో చిత్రం చేర‌నుంది. గ్లామ‌ర్ క్వీన్ స‌న్నీ లియోన్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నుంది. యుద్ధం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా కోసం 150 రోజుల కాల్షీట్స్‌ని కేటాయించిన స‌న్నీ.. క‌త్తి యుద్ధం, గుర్ర‌పు స్వారీల్లో శిక్ష‌ణ కూడా పొందుతోంది.  శివ‌గంగ ఫేమ్ వి.సి.వ‌డిఉద‌య‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

Sunny Leone Movie Title Devi
2018 ఫిబ్రవరి నుండి చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. నవదీప్, నాజర్ లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.  అయితే చిత్ర యూనిట్ సన్నీ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. సన్నీతో సెల్ఫీ దిగాలి అంటే చిత్ర టైటిల్ గెస్ చేసి ప్రొడక్షన్ సంస్థ @steevescorner ని ట్యాగ్ చేస్తూ #SunnyLeoneInSouth, #SunnyLeoneInTamil అని ట్విట్టర్ లో సినిమా టైటిల్ ని పోస్ట్ చేయాలని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీ టైటిల్ “EVI” తో ఎండ్ అవుతుందని కూడా వారు ఓ హింట్ ఇచ్చారు.

తాజాగా సినిమా పేరుతో కూడిన పోస్టర్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. సినిమాకు దేవి అని టైటిల్‌ని  ఖరారు చేస్తూ విజేతల పేర్లు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు చిత్ర నిర్మాత. మొత్తానికి పోర్న్‌స్టార్ స్థాయి నుండి ఐటమ్ బాంబ్‌గా మారిన సన్నీ లియోన్ పూర్తి స్థాయి తెలుగు సినిమాలో నటిస్తుండటంతో ఆమె కోసం థియేటర్ క్యూ కట్టడం ఖాయం అని భావిస్తున్నారు మేకర్స్.

- Advertisement -