- Advertisement -
రాష్ట్రంలో పలు యూనివర్సిటీల వీసీల నియామకంపై ఇవాళ అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు చొప్పున పేర్లను ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం దస్త్రాన్ని తయారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. శుక్రవారం ఈ దస్త్రానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోద ముద్ర వేయగా ఇవాళ విద్యాశాఖ వీసీల నియామక ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు సమాచారం.
దీంతో ఓయూ, కాకతీయ,జేఎన్టీయూహెచ్, శాతవాహన, అంబేద్కర్, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు విశ్వవిద్యాలయం వర్సిటీలకు కొత్త వీసీలు రానున్నారు. 2019 జూన్ నుంచి వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలుగా ఐఏఎస్ అధికారులు కొనసాగుతున్నారు.
- Advertisement -