ఇండియన్ వేరియంట్..ఆ కంటెంట్‌ తొలగించండి: సుప్రీం

86
Indian Supreme Court

ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు సంబంధించిన ఏ నివేదికలోనూ ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని వాడలేదని అలాంటి కంటెంట్‌ని తొలగించాలని సోషల్ మీడియా సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించింది. కరోనా బీ.1.617 వేరియంట్​ను ‘ఇండియన్‌ వేరియంట్‌’గా పేర్కొనరాదని తెలిపింది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది.

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తుండగా రోజుకు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోన్న బీ.1.617ని ఇండియన్​ వేరియంట్ గా డబ్ల్యూహెచ్​ఓ పేర్కొన్నట్లు మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. అది ఇండియన్​ వేరియంట్ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాలు లేవని తెలిపింది.

ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించే ముందు మీడియా జాగ్రత్త వహించాలని కేంద్రం సూచించింది. వైరస్, వాటి వివిధ రూపాలను అవి మొదట కనిపించిన దేశాల పేర్లతో గుర్తించడం లేదని.. వాటిని శాస్త్రీయ నామంతోనే గుర్తిస్తామని డబ్ల్యూహెచ్​ఓ ఇటీవల చెప్పిన విషయాన్ని ఉదహరించింది.