- Advertisement -
త్వరలో కొత్తపార్టీ ప్రకటిస్తానని తెలిపారు మాజీ కేంద్రమంత్రి గులామ్ నబీ ఆజాద్. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన రాహుల్, సోనిమా గాంధీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సొంత పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు.
పార్టీకి ఇంకా పేరు పెట్టాలేదని, జమ్మూ కశ్మీర్ ప్రజలే పార్టీ పేరు, జెండాను నిర్ణయిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగేలా పార్టీకి హిందుస్థానీ పేరు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా, స్థానికులకు ఉపాధి తదితర అంశాలపై పార్టీ పోరాడుతుందన్నారు.
యూపీఏలో పలుసార్లు కేంద్రమంత్రిగా, 2005 నుంచి 2008 వరకు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగాను సేవలందించారు.
- Advertisement -