నూతన మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

410
new liquor policy
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. నవంబర్ 1, 2019 నుంచి అక్టోబర్ 2021 వరకు కొత్త విధానం అమలులో ఉండనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. కొత్త లిక్కర్ పాలసీ నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. ఈ సారి జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా మార్చింది.

మద్యం దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షలు చేశారు. రాష్ట్రంలో 2216 దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా దుకాణాదారుల ఎంపిక జరగనుంది. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. వచ్చే నెల 1 వ తేదీ నుంచి కొత్తగా ఎంపికయిన మద్యం లైసెన్సుదారుల విధానం అమలుకానుంది.

- Advertisement -