క‌రోనా కొత్త వేరియంట్.. ముంబైలో తొలి కేసు..

92
New corona variant
- Advertisement -

భార‌త్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కోవిడ్‌లో కొత్త వేరియంట్ దేశంలో ప్ర‌వేశించింది. ఒమిక్రాన్ ఎక్స్ఈ గా పిలుస్తున్న ఈ వేరియంట్‌ యూకే, యూరప్ దేశాల్లో కేసులు వెల్లువలా వస్తున్నక్రమంలో ఇది అత్యంత ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. అలాంటి ఎక్స్ఈ వేరియంట్ మహమ్మారి ఇప్పుడు ఇండియాను తాకింది.

ఈ వేరియంట్‌కు సంబంధించిన తొలి కేసు ముంబైలో బుధ‌వారం వెలుగు చూసింది. బ్రిట‌న్‌లో జ‌న‌వ‌రి 19న ఈ వేరియంట్ తొలి కేసు న‌మోదు కాగా.. తాజాగా భార‌త్‌లోనూ బుధ‌వారం ఈ వేరియంట్‌కు చెందిన తొలి కేసు న‌మోదైంది. మొత్తం 376 అనుమానిత శాంపిళ్లను పరీక్షించగా, అందులో ఒకటి ఎక్స్ఈ వేరియంట్‌ పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడైంది. క‌రోనా కొత్త వేరియంట్ కేసు న‌మోదైన నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం దేశంలో హై అలర్ట్ ప్ర‌క‌టించింది.

- Advertisement -