- Advertisement -
చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా…ప్రపంచవ్యాప్తంగ 209 దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచదేశాలను గజగజలాడిస్తున్న కరోనా…చైనాలో తగ్గుముఖం పట్టినట్లే కనిపించింది. ఇటీవలె వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తివేయడంతో అక్కడి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే తాజాగా శనివారం ఒక్కరోజే చైనాలో దాదాపు 99 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఆరోగ్యశాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
ఉహాన్‌లో కరోనాను పూర్తిగా నియంత్రించిన తర్వాత ఒకరోజులో అత్యధికంగా కేసులు నమోదుకావటం ఇదే మొదటిసారి అని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. కొత్తగా వ్యాధి సోకినవారిలో 481మందిని డిశ్చార్జి చేశామని, 799 మందికి ఇంకా వైద్యం అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
- Advertisement -