గత నాలుగు నెలలుగా ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ నూతన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ కోసం అన్వేస్తున్నవిషయం తెలిసిందే. తాజాగా ఇన్ఫో అన్వేషణ ఫలించింది. సలీల్ పరేఖ్‌ను సీఈవోగా నియమించినట్లు ఇన్పోసిస్ శనివారం(నేడు) ప్రకటించింది.
గత కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ సేవల సంస్థ కేప్‌జెమిని ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ వచ్చారు సలీల్ పరేఖ్. బాంబే ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో సలీల్ బ్యాచిలర్ టెక్నాలజీ డిగ్రీ చేసిన సలీల్.. అనంతరం కార్నెల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఇంజనీరింగ్ డిగ్రీలు పొందారు. 2000 సంవత్సరంలో కేప్‌జెమినిలో చేరి పలు హోదాల్లో సలీల్ సేవలందించారు.
అయితే..కేప్‌జెమిని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ నుంచి సలీల్ ఎస్.పరేఖ్ వైదొలగినట్లు ఆ సంస్థ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే…తమ సంస్థ సీఈవో, ఎండీగా ఆయన ఎంట్రీ ఇస్తున్నట్లు ఇన్ఫోసిస్ అధికారిక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. మూడు దశాబ్ధాలుగా ఐటీ రంగంలో ఆయనకున్న అనుభవం తమ సంస్థ పురోగతికి అక్కరకు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది ఇన్ఫోసిస్ .
ఇక ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తితో విభేదాల కారణంగా విశాల్ సిక్కా ఆగస్టు మాసంలో సీఈవో బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇన్ఫోసిస్ బోర్డ్, కొత్త సీఈవో కోసం అన్వేషిస్తోంది. కాగా..తాజాగా ఇన్ఫోసిస్ నూతన సీఈవోగా ఎంపికైన సలీల్ పరేఖ్ జనవరి రెండో తేదీ నుంచి ఇన్ఫోసిస్‌లో చేరనున్నారు.