‘కాలా’కు డేట్‌ ఫిక్స్‌..

244
- Advertisement -

‘కబాలి’ తర్వాత మరోసారి యువ దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్‌లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కాలా’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రజీనికి 161వ చిత్రం కానుంది. అయితే ఇప్పటికే ‘కాలా’పై ఫాన్స్ పిచ్చ క్రేజ్‌ తో ఉన్నారు.

rajini kala movie release date fix

ఆ మధ్య ‘కాలా’ ఫస్ట్‌ లుక్‌ కూడా రావడంతో రజినీ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. ఇక అప్పటినుంచి ‘కాలా’ గురించి అప్‌డేటింగ్‌ న్యూస్‌ అంతగా బయటకు రాలేదు.  కానీ తాజా సమాచారం ప్రకారం ‘కాలా’ రిలీజ్‌ కు డేట్‌ ఫిక్సైనట్టు తెలుస్తోంది.

పవర్‌ఫుల్‌ డాన్‌గా రజినీకాంత్ కనిపించనున్న ఈ సినిమాను ఆగష్టు15న రిలీజ్‌ చెయ్యాలని దర్శక నిర్మాతలు ఫిక్సైయ్యారట. అయితే..రజినీ చేస్తున్న మరో మూవీ ‘2.0’ జనవరి 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన అది కాస్తా.. వేసవికి వాయిదా పడింది.

ఇక ఇదే గ్యాప్‌లో ‘కాలా’ వస్తుందని తలైవా ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. మరి  ఆగస్టు 15న ‘కాలా’తో రజిని థిమేటర్ లో ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.

- Advertisement -