టెక్నాలజీతో అవినీతిని అరికట్టామని తెలిపారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా మాట్లాడిన నిర్మలా సంపద సృష్టించడంలో మేకిన్ ఇండియా కీలక పాత్ర పోషించిందన్నారు.
కొత్తగా 300 కిలోమీటర్ల మేర మెట్రోని నిర్మిస్తామన్నారు. చిన్న నగరాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. సాగర్ మాల ద్వారా జలరవాణా మెరుగుపడుతోందన్నారు.పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూ. 10 వేల కోట్లు కేటాయిస్తామన్నారు.
పన్ను విధానం,రుణాల ఎగవేత విధానంలో మార్పులు తీసుకొచ్చామన్నారు.చిన్న,మధ్యతరహా సంస్థల్లో ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. గుజరాత్‌లో కొత్త ప్రాజెక్టులు చేపట్టామన్నారు. విద్యుత్ సమస్యను చాలా వరకు పరిష్కరించామన్నారు.గంగానదిలో సరుకుల రవాణా నాలుగు రేట్లు పెంచుతామన్నారు. రైల్వేల పునర్ వ్యవస్థీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
వన నేషన్,వన్ గ్రీడ్ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు.ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చేసిందన్నారు. మౌలిక రంగాల్లో భారీ పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు.వాణిజ్యాభివృద్ధిని నూతన విధానాలు తీసుకొస్తామన్నారు. దేశంలో ప్రస్తుతం మెట్రో 657 కిలోమీటర్ల మేర నడుస్తోందన్నారు.