ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయం:నిర్మలా

335
nirmalasitaraman
- Advertisement -

గత 5 సంవత్సరంలో పన్ను విధానం, రుణాల ఎగవేత నియంత్రణలో పలు మార్పులు తీసుకువచ్చామని తెలిపారు నిర్మలా సీతారామన్‌. 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన నిర్మలా 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థవైపునకు దూసుకెళ్తున్నామని చెప్పారు.

వచ్చే దశాబ్ద కాలానికి లక్ష్యాలను అందుకుంటామని చెప్పారు. పది లక్ష్యాలతో ఈ దశాబ్దానికి లక్ష్యాలను నిర్ణయించుకున్నాం. ఈ అంశాల స్ఫూర్తిగా ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేశామన్నారు. ఉద్యోగాలు కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయమన్నారు.

సంస్కరణలు,మార్పే మా ఎజెండా అని తెలిపారు. చైనా,అమెరికా తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అన్నారు. చిన్న,మధ్య తరహా సంస్థలు దేశాభివృద్ధికి దోహదం చేశాయన్నారు. మేకిన్ ఇండియాతో మంచి ఫలితాలు సాధించామన్నారు. పరోక్ష పన్నులు,నిర్మాణ రంగంలో సంస్కరణలు తెచ్చామన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక కొత్త పథకాలు తీసుకొచ్చామని చెప్పారు నిర్మలా.

- Advertisement -