బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకున్నాడనే వార్తలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి. సుశాంత్ మరణంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విపరీతంగా స్పందిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఒకే విషయం గురించి ట్విట్టర్ లో ఇంతగా ఇండియన్స్ చర్చించడం ఇదే ప్రథమం. చాలా మంది సుశాంత్ మృతికి సంతాపం తెలియజేస్తూ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్వీట్ చేస్తూ ఉండగా మరికొందరు మాత్రం సుశాంత్ కు ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసిన కొందరు బాలీవుడ్ వర్గాల వారిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు.బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌పై నెటిజన్స్ ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు.
సుశాంత్ మరణంపై ఆలియా భట్ కూడా స్పందించింది. ఈ విషయం నాకు చాలా షాకింగ్ గా ఉంది. నాకు మాట రావడం లేదు. నీవు మమ్ములను చాలా తొందరగా వదిలి వెళ్లి పోయావు అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌కు చాలా మంది స్పందించారు. గతంలో సుశాంత్ రాజ్ పూత్ అంటే ఎవరో నాకు తెలియదు అంటూ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. చనిపోయిన వెంటనే నటిస్తూ మీడియా ముందుకు వచ్చేస్తారు. నీ నటన ఇక చాలు ఆపు అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.