నెట్‌ఫ్లిక్స్‌లో నాని ‘శ్యామ్ సింగరాయ్’..!

93
- Advertisement -

నేచురల్ స్టార్ నానీ హీరోగా సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయికలుగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయిన పల్లి నిర్మిస్తున్న ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది. ఈమూవీలో బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో సినిమా విడుదల అయిన అనంతరం నెట్ ఫ్లిక్స్‌లో శ్యామ్ సింగ రాయ్ స్ట్రీమ్ కానుంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని సమాచారం. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం 30 కోట్లకు భారీ డీల్ జరిగిందని టాక్. దీంతో సినిమాకి పెట్టిన బడ్జెట్‌లో 60 % రికవర్ అయిందని సమాచారం. మరోపక్క థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగానే ఆఫర్స్ వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -