- Advertisement -
నెల్లూరు జిల్లాలో కరోనాకు ఆయుర్వేద మందు ఇస్తున్న ఆనందయ్య అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చారు పోలీసులు. సోషల్ మీడియాలో ఆనందయ్య అరెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు పోలీసులు.
ఆనందయ్యను అరెస్ట్ చేయలేదని నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. ఆయనకు అదనపు భద్రత కల్పించామని పుకార్లను నమ్మవద్దని కోరారు. వదంతలను ఎవరూ నమ్మవద్దు…అసత్యాలను ప్రచారం చేయవద్దని ప్రజలను కోరారు ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి.
కరోనా వైరస్‌కు ఆయుర్వేద మందు తయారు చేస్తూ సెలబ్రిటీగా మారిపోయారు ఆనందయ్య. ఉచితంగా కరోనా మందు పంపిణీ చేస్తుండటంతో ప్రజలు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. మరోవైపు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందులో శాస్త్రీయత ఎంతవరకు ఉందన్న దానిపై పరిశోధన చేస్తున్నారు అధికారులు.
- Advertisement -