నిర్మాత బీఏ రాజు కన్నుమూత..

60
raju

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సినిమా జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించారు బీఏ రాజు. మహేశ్‌బాబు, నాగార్జునతో పాటు పలువురు అగ్ర హీరోలు, యువ హీరోలకు,దాదాపు 1500 సినిమాలకుపైగా సినిమాలకు పీఆర్‌ఓగా పని చేశారు. 2003లో ఆయన నిర్మాతగా మారి ఆయన భార్య బీ జయ దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 2018లో బీఏ రాజు భార్య, దర్శకురాలు జయ కూడా కన్నుమూశారు.