టాలెంటెడ్ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీ విష్ణు. మెంటల్ మదిలో సినిమాతో హీరోగా మారిన శ్రీవిష్ణు తాజాగా నీది నాది ఒకే కథ అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కాగా తాజాగా ట్రైలర్‌తో అంచనాలను మరింతగా పెంచేశాడు శ్రీవిష్ణు.
విజయానికి ఐదు మెట్లు…విజయానికి ఆరు మెట్లు అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తిగా తీర్చిదిద్దారు. కామెడీతో ఆంధ్రాయాసలో ఉండే హీరో భాష ఆకట్టుకునేలా ఉంది. ఒకరకంగా చెప్పేలాంటే మీలాగా కావాలి అంటూ హీరోయిన్ చెప్పడం అంతా ఆసక్తిగా ఉంది. మానాన్నకు నచ్చేలా మారడం నాలక్ష్యమన్నారు.
విద్యా విహీన: పశువు అని పదిమందికి పాఠాలు చెప్పే టీచర్‌ను నేను.. అటువంటిది నా ఇంట్లో నుంచే ఒక పశువు బయటకు వస్తున్నాడంటే.. నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పరా.. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్క క్షణం మాకోసం ఆలోచించావా.. ఎప్పుడు చస్తామో తెలియని ఈ బొంగు లైఫ్ కోసం ఏంట్రా మీ సోదంతా.. అంటూ ట్రైలర్ మొత్తంలో దర్శకుడు వేణు ఊడుగుల రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.
నారా రోహిత్ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తుండగా మార్చి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.