రింగులజుత్తు సోయగం నిత్యామీనన్ – దుల్కార్ సల్మాన్ కాంబినేషన్ అంటేనే యువతరంలో విపరీతమైన క్రేజు. మలయాళంలో వరుస బ్లాక్‌బస్టర్ల తర్వాత ఈ జంట నటించిన `ఓకే బంగారం` తెలుగులో మరో బ్లాక్‌బస్టర్ హిట్. దుల్కార్-నిత్యా జంటగా నటించిన తాజా చిత్రం `జతగా`. మలయాళంలో జాతీయ అవార్డులు సంపాదించిన `ఉస్తాద్ హోటల్`ని `జతగా` పేరుతో అందిస్తున్నారు. అన్వర్ రషీద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా వంటి విజయవంతమైన చిత్రాల్ని అందించిన నిర్మాత సురేష్ కొండేటి ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. `జతగా` మూవీ సెన్సార్ కార్యక్రమాలు మంగళవారం(4అక్టోబర్) హైదరాబాద్‌లో పూర్తయ్యాయి. సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది.
`సంతోషం` ఎడిటర్ అండ్ పబ్లిషర్, ఎస్.కె.పిక్చర్స్ అధినేత, నిర్మాత సురేష్ కొండేటి బర్త్‌డే, తాజా చిత్రం `జతగా` సెన్సార్ పూర్తయిన సందర్భంగా..నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ -“చక్కని సందేశాత్మక కథాంశంతో రూపొందిన అందమైన ప్రేమకథా చిత్రమిది. పేద, ధనిక వర్గాల మధ్య ఉండే అంతరాలను స్పృశిస్తూ సున్నితమైన భావోద్వేగాలతో దర్శకుడు జనరంజకంగా తీర్చిదిద్దారు. దుల్కార్ సల్మాన్, నిత్యామీనన్ జంట మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్. గోపీసుందర్ బాణీలు సినిమాకి పెద్ద ప్లస్. యూత్, ఫ్యామిలీ ఆడియెన్‌కి నచ్చే పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలున్నాయి. మలయాళంలో జాతీయ అవార్డులు అందుకున్న `ఉస్తాద్ హోటల్` చిత్రాన్ని `జతగా` పేరుతో తెలుగులో అందిస్తున్నాం. మంగళవారం హైదరాబాద్‌లో సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బృందం యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ప్రేమిస్తే, జర్నీ తరహాలో అసాధారణ విజయం సాధించే చిత్రమిదని, చక్కని ప్రేమకథా చిత్రమని సెన్సార్ బృందం అభినందించడం ఆనందాన్నిచ్చింది“ అన్నారు.
ఎస్.కె.పిక్చర్స్ నుంచి స్ట్రెయిట్ చిత్రాలు:
సినీవారపత్రికా లోకంలో సురేష్ కొండేటి `సంతోషం` ప్రస్థానం 15 ఏళ్లు. కేవలం స్వయంకృషితో సాగించిన ఈ ప్రస్థానం ఆషామాషీ కాదు. ఎన్నో ఒడిదుడుకులు.. ఎగుడు దిగుడుల పయనం.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అలుపెరగని విజయవంతమైన ప్రస్థానం ఆయనది. కసిని పెట్టుబడిగా పెట్టి లక్ష్య సాధనలో తేజోవంతంగా ముందుకెళ్లి అనుకున్నది సాధించుకున్నారు. సంతోషం ఎడిటర్‌గానే కాదు… అవార్డుల కర్తగానే కాదు…. ఉత్తమ చిత్రాల పంపిణిదారుడిగా, 12 ఉత్తమ చిత్రాల నిర్మాతగానూ తనని తాను ఆవిష్కరించుకున్నారు. అందుకే సన్నిహితులు, తన గురించి తెలిసిన వారు `సక్సెస్‌ల సురేష్` అంటారు. నిప్పుల గుండం లాంటి రంగంలో ఆయనను దగ్గరగా చూసేవాళ్లు మెప్పుకోలుగా చూస్తారు. ఎవరికీ అర్థం కాడు. కత్తిమీద సాము లాంటి విన్యాసాలెన్నో చేస్తారు. చివరికి పట్టు వదలని విక్రమార్కుడిలా తన పని తాను పూర్తి చేసుకుని వెళతాడు. అదీ ఆ వ్యక్తిత్వం. ఒక వ్యక్తిగా ఇన్ని విజయాలు అంత సులువేం కాదని విశ్లేషకులు చెబుతారు. పరిమిత సిబ్బంది అండతో.. ఇంకా చెప్పాలంటే ఒంటి చేత్తో వీటన్నిటినీ సాధించుకున్ననిరంతర శ్రామికుడిగా సహచరులు చెబుతుంటారు.
15 సంవత్సరాలుగా `సంతోషం` సినీవారపత్రిక ఎడిటర్, పబ్లిషర్‌గా సినిమా లోకంలో పేరు తెచ్చుకుని, `సౌత్ ఇండియన్ సంతోషం ఫిలిం అవార్డ్స్`ను ఘనంగా నిర్వహిస్తున్న వ్యక్తిగా సురేష్ కొండేటి పయనం అసాధారణం. “15 ఏళ్ల పాటు సినీవారపత్రికను నడిపిస్తూ.. ఇలా అవార్డులు నిర్వహించడం అంటే ఓ వ్యక్తికి అసాధ్యం. కార్పోరెట్ కంపెనీలకే సాధ్యం కాని పని ఇది. అయితే ఓ వ్యక్తి 14 సంవత్సరాల పాటు అవార్డుల కార్యక్రమం, 15 సంత్సరాలుగా సినీ పత్రికను విజయవంతంగా నడిపించడం గ్రేట్“ అంటూ `సంతోషం 14వ అవార్డు వేడుకల వేళ దర్శకరత్న దాసరి అంతటి వారే ప్రశంసించారు. నేను ఉన్నంతవరకూ ఈ అవార్డుల కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. తుది శ్వాస వరకూ నడిపిస్తూనే ఉంటానని `సంతోషం 14వ వార్షికోత్సవం` కర్టెన్‌రైజర్ వేడుకలో పత్రికాధినేత, నిర్మాత సురేష్ కొండేటి ప్రకటించడం చూస్తే సినిమాపై అతడికి ఉన్న ప్యాషన్ అర్థమవుతుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని నిర్మిస్తూ, మరెన్నో అభిరుచి ఉన్న సినిమాల్ని అందించాలన్న సంకల్పంతో అటు అనువాద చిత్రాల్ని తెలుగులో అందిస్తూనే, స్ట్రెయిట్ చిత్రాల్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం `జతగా` రిలీజ్‌కి రెడీ అవుతోంది. అలాగే ఓ స్ట్రెయిట్ చిత్రాన్ని నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, తిలకన్, సిద్ధిఖి, అసీమ్ జమాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: ఎస్. లోకనాథన్, రచన: అంజలి మీనన్, పాటలు: శ్రీమణి, పులగం చిన్నారాయణ, శ్రీవల్లి, మాటలు: సాహితి.