రామోజీ ఫీల్మ్‌సిటీలో బాలయ్య హోమం..!

617
nbk
- Advertisement -

హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. ఇటీవలె థాయ్‌లాండ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది.

షెడ్యూల్‌లో భాగంగా అన్బు, అరవి అధ్వ‌ర్యంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్నారు. ప్లాష్ బ్యాక్ లో ఈ సన్నివేశాలు వస్తాయట. ఇందులో బాలయ్య ఓ హోమం జరుపుతుండగా విలన్స్ అటాక్ చేస్తారు. ఈ క్రమంలోనే జరిగే భారీ ఫైట్‌ని తీస్తున్నారు.

భారీ అంచ‌నాల న‌డుమ రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డనున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఓ లుక్‌కి, పోస్ట‌ర్స్‌కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. బాలయ్య సరసన సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -