సెంచరీ చేయాలనుంది: సంఘవి

406
sanghavi

ఆహా’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు సీనియర్ హీరోయిన్ సంఘవి. మొదట్లో చిన్న హీరోలతో సినిమాలు చేసినా అత్యత్తమ నటన కనబరిచి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు దక్షిణాదిలో పలు భాషల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ తాజాగా ఓ ఛానల్‌ షోలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఇప్పటివరకు దక్షిణాదిలో అన్నిభాషల్లో కలిపి 99 సినిమాలు చేశానని తెలిపింది సంఘవి. సెంచరీ చేయాలని కోరిక ఉందని ఎప్పుడు నెరవేరుతుందో చూడాలని చెప్పుకొచ్చింది. మంచి క్యారెక్టర్స్ వస్తేనే చేయాలనుకున్నానని అందుకే సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ఓ డ్యాన్స్‌ షోకి జడ్జీగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

తన అసలు పేరు కావ్య రమేష్ అని సినిమాల్లోకి వచ్చిన తర్వాత సంఘవిగా మారిపోయిందన్నారు. తన భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని తెలిపింది. కృష్ణవంశీతో సింధూరం సినిమా చేయడం ఎప్పటికి మర్చిపోలేనని చెప్పారు. ఆ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్‌ కూడా తీసుకోలేదన్నారు.ఆ సినిమాకు నంది అవార్డు రావడం,తనకు నటిగా గుర్తింపు వచ్చిందన్నారు.

మీ తమ్ముడు ఖయ్యూ నాకు జూనియర్. అతడు నాకు లవ్ లెటర్స్ ఎన్నో పంపించేవాడు. కొన్ని రక్తంతో కూడా రాశాడు. రోజుకో లెటర్ పంపేవాడు అని సంఘవి చెప్పగానే అలీ షాకయ్యారు.