అమెరికాలోని లాస్ ఏంజిల్స్ చాట్స్‌వర్త్ ప్రాంతంలో విషాదకర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదాన్ని ఆకాశం నుంచి ప్రత్యక్ష ప్రసారం (లైవ్ కవరేజ్) చేస్తున్న ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ జంట ప్రమాదాల్లో ముగ్గురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
చాట్స్‌వర్త్‌లోని నార్డ్‌హాఫ్ స్ట్రీట్ అండ్ డి సోటో అవెన్యూ వద్ద వేగంగా వచ్చిన ఒక SUV కారు.. లాస్ ఏంజిల్స్ మెట్రో బస్సును అత్యంత దారుణంగా ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు భాగాలు తీవ్రంగా దెబ్బతినగా, సంఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ రోడ్డు ప్రమాద తీవ్రతను గాలిలో నుంచి కవర్ చేసేందుకు NBC లాస్ ఏంజిల్స్ (KNBC-TV) న్యూస్ ఛానెల్‌కు చెందిన హెలికాప్టర్ ఘటనా స్థలానికి చేరుకుంది. దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సమయంలోనే, నార్త్ మేసన్ అవెన్యూలోని వాణిజ్య భవనాల మధ్య ఉన్న పార్కింగ్ ప్రాంతంలో హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయింది.
హెలికాప్టర్ అక్కడున్న కంటైనర్లు, వాహనాలపై పడటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ (LAFD) దళాలు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చాయి. హెలికాప్టర్ ప్రమాద స్థలంలో ముగ్గురు మరణించినట్లు అధికారులు ధృవీకరించగా, తీవ్రంగా గాయపడిన మరొకరిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పైలట్, రిపోర్టర్‌తో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఛానెల్ యాజమాన్యం వెల్లడించింది.
సమాచారం అందుకున్న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), NTSB అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హెలికాప్టర్ కూలిపోవడానికి సాంకేతిక లోపమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
లైవ్.. హెలికాప్టర్ క్రాష్ విజువల్స్
యూఎస్ – లాస్ ఏంజిల్స్‌లోని చాట్స్వర్త్లో ఘోర ప్రమాదం
రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తూ గాలిలోనే కుప్పకూలిన NBC లాస్ ఏంజిల్స్ న్యూస్ ఛానెల్ హెలికాప్టర్
చాట్స్‌వర్త్‌లోని నార్డ్‌హాఫ్ స్ట్రీట్‌లో LA మెట్రో బస్సును ఢీకొట్టిన SUV.. ఈ ప్రమాదంలో… pic.twitter.com/3gwyq3huI7
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026
Also Read:అమెరికాకు లొంగిపోయిన మోదీ!

