మేనేజమెంట్ కార్మికుల మధ్య స్నేహాపూర్వక సంబంధాలు ఎర్పడితే ఆర్దిక వృద్ధిని సాధించవచ్చని రాష్ట్ర హోం, కార్మిక శాఖామాత్యులు నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన మే డే ఉత్పవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 30 మంది కార్మికులకు శ్రమశక్తి అవార్డులు, 8మందికి అత్యుత్తమ యాజమాన్య అవార్డులు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..1881లొ మొదటి సారిగా అమెరికాలో చికాగోలో కార్మికుల సంక్షేమానికై ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి రోజుకు 8 గంటల పని దినాలను సాధించారన్నారు. ప్రభుత్వం కార్యికుల సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో కేంద్రం నుండి ఆర్ధిక సహాయం కోరుతూ ప్రతిపాదనలు పంపామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి 20 కోట్ల 4 లక్షల 68 వేల 9 వందల 67 రూపాయలు సెస్ రూపంలో వసూలు చేయడం జరిగిందన్నారు.
పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొన్న వారికి 15 రోజులలోనే అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇతర దేశాల నుండి పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని, దాని ఫలితంగా మరింత ఉద్యోగ అవకాశాలు కల్పించొచ్చాన్నారు. 14 లక్షల మంది డ్రైవర్లకు 20 వేల మంది హోంగార్డులకు 16492 మంది వర్కింగ్ జర్నలిస్టులకు రూ.5 లక్షల ఉచిత ప్రమాద మరణ భీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అసంఘటిత రంగంలో పని చేస్తున్న భవన, ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ మండలి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విపత్కర పరిస్థితులలో చిక్కుకునే కార్మికుని కుటుంబానికి ఆర్ధికంగా అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కార్మికులు వారి కుటుంబసభ్యులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చుటకు రూ. 10 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కార్మిక శాఖ ప్రినిపల్ సెక్రటరీ శశాంక్ గోయెల్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయన్నారు. కార్మికులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
ఆహ్మద్ నదీమ్ కమీషనర్ ఆఫ్ లేబర్ మాట్లాడుతూ..కార్మికులకు ఏదైన సమస్యలు వస్తే లేబర్ డిపార్ట్‌మెంట్లో కంప్లయింట్ చేసుకోవచ్చన్నారు. కార్మికులకు వచ్చే బెనిఫిట్లను సక్రమంగా అందేలా చూడడం జరుగుతుందన్నారు.
ఎమ్‌ఎల్‌సి రాములు నాయక్ మాట్లాడుతూ..128వ మే డే సందర్భంగా కార్మికులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మినిమం వేజస్ చట్టం అందించే ఆలోచనలో ఉంది. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. కార్మికులు సంఘటితంగా ఉండాలన్నారు.
ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ..ప్రపంచమంతా కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అన్నారు. కార్మికులు దేశం కోసం ఎంతో శ్రమిస్తున్నారన్నారు. వేతనం, ఉద్యోగం, సామాజిక భద్రత విషయంలో కార్మికులు ప్రత్యేక హక్కులు ఉన్నాయన్నారు. 14 సంవత్సరాల లోపు బాలలు ఏ పరిశ్రమలలో కూడా పని చేయకూడదన్నారు. మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు 26 వారాలకు పెంచామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సొంత ఇళ్లు కట్టించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో తొలుత కార్మిక శాఖ ఆధ్వర్యంలో లఘుచిత్రం ప్రదర్శించారు. అనంతరం అత్యుత్తమ యాజమాన్య అవార్డులు 8 మందికి, శ్రమశక్తి అవార్డులు 30 మందికి ఉత్తమ కార్మికులకు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కే.వై.నాయక్, డైరెక్టర్ ఎంప్లాయిమెంట్, ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి, జేసీఎల్ చంద్రశేఖర్, గంగాధర్, మినిమం వేజస్ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆలపించిన గీతాలు అకట్టుకున్నాయి.