కలెక్టర్‌ నయనతార…

273
NAYANATARA
- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు ‘నయనతార’. అప్పుడెప్పుడో 2003వ సంవత్సరంలో మలయాళం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన నయన ఏళ్లు గడుస్తున్నా ఇంకా తన స్టార్ హోదాను ఏ మాత్రం తగ్గించడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తోంది. ఇప్పుడు ఈ భామ కలెక్టర్ గా కనిపించబోతుంది. తమిళంలో తెరకెక్కుతున్న “ఆరమ్” సినిమాలో నయనతార ప్రధానపాత్రదారిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Nayanathara

అయితే ఈ సినిమాను తెలుగులో “కర్తవ్యం” పేరుతో రిలీజ్ చేస్తున్నారుట. నయనతార జిల్లా కలెక్టర్ గా నటిస్తున్న ఈ సినిమాను ‘గోపి నైనర్’ దర్శకత్వంలో ‘ఆర్.రవీంద్రన్’ నిర్మిస్తున్నారు. ప్రజల కోసం పాటుపడుతూ, రాజకీయ నాయకులకు ఎలా చెక్‌ పెట్టారనే కథాశంతో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాపై అమ్మడు భారీ ఆశలనే పెట్టుకుంది. మరి ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఓం ప్రకాష్‌ కెమెరామెన్‌గా వ్యవహరించారు.

- Advertisement -