ప్రియుడితో కలిసి వ్రతంలో నయన్..!

387
nayanthara

వరుస సినిమాలతో తెలుగు, త‌మిళంలో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది లేడి సూపర్ స్టార్ నయనతార. లేడి ఓరియెంటెడ్ మూవీలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించుకున్న నయన్ రీసెంట్‌గా బాలాజీ దర్శకత్వంలో మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ షూటింగ్‌లో కాస్త గ్యాప్ దొరకడంతో ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి వ్రతం చేస్తోంది. కన్యాకుమారిలోని భగవతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న నయన్ ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ప్రారంభించింది. అనంతరం తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు.

ఇక బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు మూక్కుత్తి అమ్మన్ అనే టైటిల్ ఖరారు చేయగా అమ్మవారి పాత్రలో కనిపించనుంది నయన్. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

Nayanthara takes up deeksha…Nayanthara took a special deeksha before commencing the shoot for a mythological movie.