“వెంకీమామ” అతిధి పాత్రలో సమంత?

317
Venkymama Cameo Samantha

విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రల్లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వెంకీమామ. నిజజీవితంలో మామా అల్లుళ్లుగా ఉన్న వెంకటేశ్, నాగ చైతన్య లు తొలిసారిగా ఆన్ స్క్రీన్ పై కూడా మామ అల్లుళ్లుగా నటిస్తున్నారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటించిన ఈచిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇటివలే విడుదలైన ఈచిత్ర ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

 Venkymama

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈచిత్రాన్ని డిసెంబర్ 13న ఈసినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. కాగా ఈమూవీలో సమంత గెస్ట్ రోల్ నటించిందని సమాచారం. ఈ సినిమాలో అతిథి పాత్రలో సమంత కనిపించనుందని అంటున్నారు. కథలో అతిథి పాత్ర కీలకం కావడం వలన, సమంత అయితే కథా పరంగాను .. క్రేజ్ పరంగాను కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారట. అయితే కావాలనే ఈ విషయాన్ని ఇప్పటివరకూ సిక్రెట్ గా ఉంచారని తెలుస్తుంది.