అందాలతార నయనతార లేడీ ఓరియంటేడ్ సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మాత్రం అడపదడపా సినిమాలు చేస్తోంది. వెంకటేష్ తో ‘బాబు బంగారం’ తర్వాత తెలుగులో బాలయ్యతో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నయన్. ‘సింహా, శ్రీరామరాజ్యం ‘తర్వాత బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి కె.యస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాలయ్యకు 102వ సినిమా కానుంది.
ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 101 సైరా నటించే బంపర్ ఆఫర్ కొట్టేసిన ఈ బ్యూటీ మళ్లీ టాలీవుడ్‌లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ముఖ్యంగా ఇద్దరు అగ్రహీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేయడంతో ఇప్పుడు నయన్ ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యంగా అరవయ్యేళ్లు దాటిన హీరోల పక్కన కూడా సూట్ అయ్యే హీరోయిన్ కావడంతో నయనతార పంట పండుతోంది. ఆ ఏజ్ గ్రూప్ హీరోల కోసం ఎక్కువ ఆప్షన్లు లేకపోయేసరికి ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. ఇతర హీరోయిన్లు తీసుకునే దానికి నయనతార డబుల్ ఛార్జ్ చేయడంతో పాటు ప్రమోషన్స్‌కి రానని తెగేసి చెబుతోందట. హీరో ఎవరైనా కానీ తన కండిషన్లు మారవని స్టార్లని సైతం లెక్క చేయడం లేదట.
తమిళంలో ప్రస్తుతం ఆరడజను సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని పాటిస్తుందట.