ప్రభాస్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?

467
prabhas
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈమూవీ ట్రైలర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై భారీగా అంచనాలున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం ఈనెల 30న తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

హాలీవుడ్‌ స్థాయి కాన్సెప్ట్‌తో పాన్‌ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా సాహో చిత్రయూనిట్ చెన్నైలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

ఈసందర్భంగా అక్కడ మీడియా ప్రభాస్ ను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా తమిళ్ లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడగగా.. తనకు నయనతార చాలా అంటే ఇష్టమని చెప్పారు, వెండితెరపై ఆమె కనిపించే తీరు, కనబర్చే అభినయం తనకు బాగా నచ్చుతాయని పేర్కొన్నారు ప్రభాస్. ఇక ప్రభాస్ నయనతార కలిసి యోగి సినిమాలో నటించారు.

- Advertisement -