సెప్టెంబర్ లో శేఖర్ కమ్ముల చైతూ మూవీ…

444
shekar Kamula Naga Chaitanya
- Advertisement -

మజీలి సినిమాతో చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు అక్కినేని నాగచైతన్య. సమంత హీరోయిన్ గా నటించిన ఈచిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు. ప్రస్తుతం నాగ చైతన్య బాబీ దర్శకత్వంలో వెంకీమామ సినిమాలో నటిస్తున్నారు. ఈమూవీలో వెంకటేశ్ నాగచైతన్య మామ అల్లుళ్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈమూవీని డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. చైతూ తన తర్వాతి మూవీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈమూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

Naga chaitanya new Movie

ఆగస్ట్ మొదటి వారంలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పినా..వ్యక్తిగత కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 5 నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటించనుంది. ఈమూవీలో చైతూ పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడని తెలుస్తుంది. నారాయణదాస్ నారంగ్, రామ్‌ మోహన్ రావు సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు.

- Advertisement -