లాజిక్‌ మిస్‌ అవుతున్నారు : నయన్‌

464
- Advertisement -

ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాసుకుంటూ పోతున్నారని.. కానీ, తన మనసులో ఏముందో మాత్రం ఎవరూ చూడలేరని అంటోంది నయనతార. తనపై కథనాలు రాస్తున్నవారిపై నయనతార ఆగ్రహం వ్యక్తం చేసింది.

నటించడానికే తాను సినిమాల్లోకి వచ్చానని.. మంచి కథ వస్తేనే చేస్తానంటూ మడిగట్టుకుని కూర్చుంటే… ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోతాయని చెప్పింది. అప్పుడు నయనతారకు అవకాశాలు రావడం లేదంటూ మళ్లీ కథనాలు రాస్తారని తెలిపింది. గ్లామర్ పాత్రల్లో నయనతార రెచ్చిపోతోందంటూ ఇప్పుడు రాసిన వారే… నయనతారకు సినిమాలు లేవంటూ అప్పుడు రాస్తారని చెప్పింది.

 nayana thara angree on writters

తన ప్రేమ, పెళ్లి గురించి కూడా చాలా వార్తలు వస్తున్నాయని… వాటిని తన కుటుంబసభ్యులు నమ్మరని నయన్ తెలిపింది. తనకు తన కుటుంబసభ్యులు ఎంతో స్వేచ్ఛను ఇచ్చారని… అలాంటిది ఇలాంటి పుకార్లను వారు ఎలా నమ్ముతారని ప్రశ్నించింది.

అయితే, రేపు తనకు పెళ్లి జరిగితే… ఈ గాసిప్స్ ను తన అత్తింటివారు నమ్మితే, తన పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని ఈ కథనాలు రాస్తున్నవారు గుర్తించాలని… ఇంత చిన్న లాజిక్ ను వారు ఎలా మర్చిపోతారో అంటూ మండిపడింది.

- Advertisement -