పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా..

58
pcc
- Advertisement -

కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను రాజీనామా చేయాలని పార్టీ అధినేత్రి సోనియా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు.

త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. పార్టీ అధ్య‌క్షురాలు సోనియా ఆశించిన‌ట్లే తాను రాజీనామా చేస్తున్న‌ట్లు సిద్దూ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.
ఇటీవ‌ల జ‌రిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓట‌మి పాలైన సంగతి తెలిసిందే.

- Advertisement -