సన్నీలియోన్‌తో నవదీప్ వెబ్ సిరీస్.!

654
navdeep
- Advertisement -

జై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నవదీప్‌. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన నవదీప్ చాలా టీవీ షోలకు హోస్ట్‌గా కూడా చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు నవదీప్. బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన రాగిణి ఎంఎంఎస్‌ రిటర్న్స్‌ అనే వెబ్ సిరీస్‌ సీజన్‌-2లో సన్నీతో కలిసి కటించనున్నాడు. ఈ విషయాన్ని నవదీప్‌ స్వయంగా వెల్లడించారు.

సన్నీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది…మీరు చాలా ఫ‌న్నీ అని స‌న్నీతో క‌లిసి దిగిన ఫోటోకి కామెంట్ పెట్టాడు నవదీప్. బాలాజీ టెలీఫిల్మ్స్ పతాకంపై ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి చాలా క్రేజ్ ఉంది.

- Advertisement -