యంగ్ హీరో నవదీప్, కావ్యా శెట్టి హీరోహీరోయిన్లుగా కొప్పుల రాజేశ్వరీదేవి సమర్పణలో లెజెండ్ పిక్చర్స్ పతాకంపై ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో రమేష్‌బాబు కొప్పుల నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘నటుడు’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆడియన్స్‌ని థ్రిల్ చేసే మూవీ ఇది
హీరో నవదీప్ మాట్లాడుతూ – ”దర్శకుడు ప్రసాద్ నేరేట్ చేసిన సబ్జెక్ట్ నాకు చాలా థ్రిల్లింగ్‌గా అన్పించడంతో వెంటనే ఈ చిత్రంలో నటించాను. సినిమా చాలా బాగా వచ్చింది. నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుందని కాన్ఫిడెన్స్‌తో వున్నాను. రమేష్‌బాబు పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయంలో సినిమాని బాగా రూపొందించారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో వున్నాయి. డెఫినెట్‌గా ఆడియన్స్‌కి రీచ్ అయ్యే సినిమా ఇది. త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు” అన్నారు.
నిర్మాత రమేష్‌బాబు కొప్పుల మాట్లాడుతూ – ”మానవ సంబంధాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కథను ట్రీట్ చేసే విధానంలో కొత్తదనం వుండటంతో సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఆ సినిమాల కోవలో మా ‘నటుడు’ చిత్రం కూడా చేరుతుంది. ఈ చిత్రం సబ్జెక్ట్ సస్పెన్సతో రన్ అవుతూ ఆడియన్స్‌ని థ్రిల్ చేసే విధంగా వుంటుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం” అన్నారు.
దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ మాట్లాడుతూ – ”మానవ సంబంధాలతో వ్యాపారం చేసే ఓ కుర్రాడి కథ ఇది. ప్రేమలోని ఒక సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తీశాం. ప్రేమల్ని అమ్మడం, కొనడం అనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం వుంటుంది. నవదీప్ కథ మీద నమ్మకంతో ప్రాణం పెట్టి ఈ సినిమా చేసారు. నవదీప్ అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ చేశారు. నవదీప్‌కి ఈ చిత్రంతో నటుడిగా మరింత మంచి పేరు వస్తుంది. మా నిర్మాత రమేష్‌బాబు అందించిన సహకారంతో చిత్రాన్ని అనుకున్న బడ్జెట్‌లోనే తీయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంతవరకు చూడని ఓ కొత్త క్యారెక్టర్‌లో నవదీప్‌ని ప్రజెంట్ చెయ్యడం జరిగింది. ప్రజెంట్ యూత్‌కి ఒక రిప్రజెంటేటివ్‌లా ఈ సినిమా వుంటుంది. నేను ఏదైతే అనుకొని ఇండస్ట్రీకి వచ్చానో ఖచ్చితంగా అది ఈ చిత్రంతో నెరవేరుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను” అన్నారు.
నవదీప్, కావ్యాశెట్టి, నాగినీడు, సూర్య, సత్య, ఆశిష్ గాంధీ, జియా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా:వాసు, సంగీతం: జయసూర్య, రీ-రికార్డింగ్: చిన్నా, ఎడిటింగ్: నాగిరెడ్డి, కో-డైరెక్టర్ శేషుకుమార్, అసోసియేట్ డైరెక్టర్స్: మజ్జి కిషోర్, తిరునగరి ప్రవీణ్, రాజేంద్ర, కాస్ట్యూమ్స్: సి.వి.ఎం.ఆనంద్,
నిర్మాత: రమేష్‌బాబు కొప్పుల, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్