విక్టరీ వెంకటేష్‌తో ‘నాట్యం’ సాంగ్ రిలీజ్..

152
- Advertisement -

నాట్యంఅంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ అద్భుత‌మైన‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కు ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఇటీవ‌ల న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఆవిష్క‌రించిన ఈ సినిమాలో తొలి సాంగ్ నమః శివాయ‌కు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న ల‌భించింది. ఈ సినిమాను అక్టోబ‌ర్ 22, న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. వెంకటేశ్ చేతుల మీదుగా రేవు ఉదయం 10:08 నిమిషాలకు ఈ సినిమా నుంచి ‘పోనీ పోనీ’ అనే ఒక పాటను రిలీజ్ చేయనున్నారు. శ్రావణ్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా నిలవనుంది. ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రలు పోషించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించారు. నిశ్రింకళ ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.

- Advertisement -