సెన్సార్ పూర్తి చేసుకున్న బ్యాచ్‌లర్..

65
Most Eligible Bachelor

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ మూవీని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రతీ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సెప్టెంబర్‌ 30వ తేదీ సాయంత్రం 6:10 గంటలకు విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 15న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్.