బిగ్ బాస్…గుంటనక్క ఎవరో చెప్పేసిన మాస్టర్!

90
master
- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. నాలుగోవారంలో భాగంగా ఇంటి నుండి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కాగా గుంటనక్క అని ఎవరిని ఉద్దేశించి అన్నాడో చెప్పేశారు. గుంటనక్క రవి అనే విషయాన్ని బయటికి వచ్చిన తర్వాత తెలిపాడు.

బిగ్ బాస్ హౌస్ నుండి గంభీరంగా వచ్చిన నటరాజ్ వేదిక మీద మాత్రం కాస్తంత భావోద్వేగానికి గురయ్యాడు. హౌస్ లో కంటే బయటే తన అవసరం ఉందని దేవుడు భావించే ఇలా చేశాడని తెలిపారు. ప్రస్తుతం భార్య ప్రెగ్నెంట్ కావడంతో డెలివరీ సమయంలో ఆమె పక్కన ఉండాలన్నదే తన కోరిక కూడా అని నటరాజ్ చెప్పాడు.

తర్వాత బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెంట్స్ కొందరిని జంతువులతో పోల్చమని కోరాడు. అందులో సిరిని పాముతో, లోబోను ఎలుకతో, విశ్వను ఊసరవెల్లితో, శ్రీరామ్ ను మొసలితో, ప్రియాంకను చిలుకతో. మానస్ ను గాడిదతో పోల్చాడు నాటరాజ్.

అంతకముందు గ్రూప్ సాంగ్స్ కు హౌస్ లోని మెంబర్స్ అందరూ కలిసి డాన్స్ చేయగా, డ్యూయెట్ సాంగ్స్ ను మానస్, ప్రియాంక; షణ్ముఖ్ – సిరి; సన్నీ – ప్రియ; రవి – యానీ; శ్రీరామ్ – హమీద; జెస్సీ – శ్వేత కలిసి అభినయించడం విశేషం. భైరవ ద్వీపం లోని నరుడా ఓ నరుడా పాటకు విశ్వ, ప్రియాంక రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు.

- Advertisement -