ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న భారత్‌లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1928 ఫిబ్రవరి 28న భారత శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ ‘రామన్ ప్రభావం’ను కనుగొన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. శాస్త్రీయ చైతన్యాన్ని ప్రోత్సహించేందుకు 1986లో కేంద్ర ప్రభుత్వం ఈ రోజును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా భారత్ 2035 నాటికి గ్లోబల్ సూపర్ పవర్‌గా ఎదగాలనే లక్ష్యంతో అంతరిక్షం, రక్షణ రంగాల్లో కీలక మిషన్లను అమలు చేస్తోంది. వ్యూహాత్మక స్వయం సమృద్ధి, సాంకేతిక ఆధిపత్యం సాధించడమే ఈ రోడ్‌మ్యాప్ లక్ష్యం.
గగనయాన్ మిషన్: 2027 ప్రారంభంలో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టాలని భారత్ ప్రణాళిక వేస్తోంది. దానికి ముందు మూడు మానవరహిత పరీక్షా ప్రయోగాలు జరగనున్నాయి. 2026 మార్చి నాటికి ‘వ్యోమమిత్ర’ అనే హ్యూమనాయిడ్ రోబోట్‌తో జీ1 మిషన్ ప్రయోగించనున్నారు.
భారతీయ అంతరిక్ష కేంద్రం (BAS): 2035 నాటికి భారత్‌కు స్వంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడం లక్ష్యం.
నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికిల్ (NGLV): ‘సూర్య’ అనే హెవీ లిఫ్ట్ రాకెట్ అభివృద్ధి జరుగుతోంది.
చంద్రయాన్-4 & 5: చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసి నమూనాలు భూమికి తీసుకురావడం లక్ష్యం. 2027–28లో ప్రయోగం జరగనుంది. జపాన్ జాక్సాతో సంయుక్తంగా చంద్రయాన్-5 కూడా 2028లో ప్రణాళికలో ఉంది.
Also Read:కనకదుర్గమ్మ సన్నిధిలో మంత్రి కోమటిరెడ్డి
అంతేకాక హైపర్‌సోనిక్ క్షిపణుల అభివృద్ధి, స్వదేశీ యుద్ధ నౌకలు, ఆధునిక యుద్ధవిమానాలపై దృష్టి సారిస్తోంది. 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపై అడుగుపెట్టించడం తుదిలక్ష్యం.

