హోలీ అంటే రంగులు, సంగీతం, స్నేహితులతో సందడి. అయితే మైగ్రేన్‌తో బాధపడేవారికి ఈ వేడుకలు తలనొప్పిని ప్రేరేపించే అవకాశం ఉంది. పెద్ద శబ్దాలు, ఘాటైన వాసనలు, ఎండలో ఎక్కువసేపు ఉండటం, డీహైడ్రేషన్, నిద్ర–ఆహార అలవాట్లలో మార్పులు ఇలా అన్ని కలిసి మైగ్రేన్ కు కారణమవుతాయి.
మైగ్రేన్ సాధారణ తలనొప్పి కాదు. ఇది నర సంబంధిత సమస్య. కాంతి, శబ్దం, వాసనల వంటి సెన్సరీ ప్రేరణలకు మెదడు అత్యంత సున్నితంగా స్పందిస్తుంది. హోలీ సమయంలో ఈ అన్ని ట్రిగ్గర్లు ఒకేసారి ఉంటాయి అని చెప్పారు.
బలమైన వాసనలు: సింథటిక్ గులాల్, పరిమళాలు తలనొప్పిని ప్రేరేపించవచ్చు. సహజ రంగులు వాడటం మంచిది.
పెద్ద శబ్దాలు: డీజేలు, డ్రమ్స్ మెదడును అధికంగా ఉత్తేజితం చేస్తాయి. మధ్యలో నిశ్శబ్ద ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి.
ఎండ, కాంతి: సన్‌గ్లాసెస్, టోపీ ధరించడం ఉపశమనం ఇస్తుంది.
డీహైడ్రేషన్: తగినంత నీరు తాగకపోవడం రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. వేడుకలకు వెళ్లే ముందు, మధ్యలో నీరు తాగాలి.
Also Read:కనకదుర్గమ్మ సన్నిధిలో మంత్రి కోమటిరెడ్డి
అక్రమ ఆహారం, నిద్రలేమి: సమయానికి భోజనం, సరిపడ నిద్ర అవసరం.
హోళి వేడుకల తర్వాత కూడా “లెట్-డౌన్ మైగ్రేన్” వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

