నేషనల్ జియోగ్రాఫిక్ 33’లో ప్రియాంక

1
- Advertisement -

ప్రఖ్యాత సంస్థ నేషనల్ జియోగ్రాఫిక్ విడుదల చేసిన “33 of 2026” ప్రత్యేక జాబితాలో బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, ఆలియా భట్ స్థానం సంపాదించడం విశేషంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రభావం చూపుతున్న 33 మంది ప్రముఖులను గుర్తిస్తూ ఈ జాబితాను ప్రకటించారు.

సినిమా రంగంలోనే కాకుండా సామాజిక సేవ, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో చేసిన కృషికి గాను ప్రియాంక చోప్రా, అలియా భట్‌లను ఈ జాబితాలో చేర్చినట్లు నేషనల్ జియోగ్రాఫిక్ తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకున్న ప్రియాంక చోప్రా, గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగి పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అలియా భట్ కూడా తన సినిమాల ద్వారా మాత్రమే కాకుండా పర్యావరణంపై అవగాహన పెంచే కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

Also Read:మళ్లీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్?

ఈ సందర్భంగా 33 మంది ప్రముఖులతో కూడిన ప్రత్యేక పోస్టర్‌ను నేషనల్ జియోగ్రాఫిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ, సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులకే ఈ జాబితాలో చోటు కల్పించామని సంస్థ పేర్కొంది. ఈ గౌరవం భారతీయ సినీ పరిశ్రమకు మరో గుర్తింపు అని చెప్పవచ్చు.

- Advertisement -