పెళ్లి వార్తలపై అనుష్క క్లారిటీ!

11
- Advertisement -

దక్షిణాది స్టార్ నటి అనుష్క శెట్టి పెళ్లిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఓ ప్రముఖ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు వివిధ వేదికల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తి కలిగించినప్పటికీ, అవి నిజం కాదని తాజాగా స్పష్టమైంది.

ఈ నేపథ్యంలో అనుష్క టీమ్ అధికారికంగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న పెళ్లి వార్తలను పూర్తిగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు ప్రచారం చేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

“ఒకరి వ్యక్తిగత జీవితాన్ని వార్తలుగా మార్చే ముందు అది నిజమా కాదా అని కనీసం ధృవీకరించాలి. ఊహించడం, అంచనా వేయడం, అనధికారిక సమాచారాన్ని పదేపదే ప్రచురించడం బాధ్యతాయుతమైన జర్నలిజం కాదు” అని అనుష్క టీమ్ తన ప్రకటనలో పేర్కొంది.

ఇలాంటి అసత్య ప్రచారాలు వ్యక్తిగత గోప్యతను భంగం చేస్తాయని, అభిమానులు కూడా ఇలాంటి వార్తలను నమ్మకూడదని సూచించింది. ప్రస్తుతం అనుష్క తన సినీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ వివరణతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్టే అయ్యింది.

Also Read:హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

- Advertisement -