ఉగాది వేళ..ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల

6
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగార్థులకు ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తూ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. మొత్తం 10,060 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

గతంలో నిర్వహించిన యువగళం పాదయాత్ర సందర్భంగా ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ తీసుకువస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా లోకేశ్ నెరవేర్చారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ క్యాలెండర్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వం పారదర్శకంగా నియామక ప్రక్రియను చేపట్టి, అర్హులైన అభ్యర్థులకు అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఈ ఉద్యోగాలను ఒకేసారి కాకుండా, మూడు సంవత్సరాల వ్యవధిలో దశలవారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి, అవసరానికి అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఉగాది పండుగ సందర్భంగా వచ్చిన ఈ ప్రకటన యువతలో ఆశలను నింపింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:మళ్లీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్?

- Advertisement -