రామ్‌..ఆంధ్రా కింగ్ తాలుకా!

6
- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

నెల రోజుల కొత్త షూటింగ్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్‌లో నిర్మించిన సెట్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం, రామ్, భాగ్యశ్రీ బోర్సే పై ప్రేమ సన్నివేశాలను నైట్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ నైట్ షెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత క్లైమాక్స్, ఇతర కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి టీం20 రోజులు డే టైంకి షూటింగ్‌ షిఫ్ట్ అవుతుంది. ఈ చివరి షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు సాయంత్రం 5:04 గంటలకు సినిమా నుండి మొదటి పాటకు సంబంధించిన వివరాలు వెల్లడి చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని వివేక్ & మార్విన్ అనే మ్యూజికల్ డ్యూ అందిస్తున్నారు.

Also Read:గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

- Advertisement -