- Advertisement -
పద్మజ ఫిలింస్ పతాకంపై ఎస్ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న చిత్రం ‘నటన సూత్రధారి’. అమృత రామమ్ సినిమాతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ కొంటాడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అమిత రంగనాథ్, సుశీల్ మాధవపెద్ది జంటగా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రలను ఛరిష్మా శ్రీకర్, ఆకాష్ రాథోర్, కిషోర్ మారిశెట్టి పోషిస్తున్నారు. ‘నటన సూత్రధారి’ సినిమా మోషన్ పోస్టర్ ను సూపర్ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. మోషన్ పోస్టర్ బాగుందని, సినిమా మంచి విజయం సాధించాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -