నయీం కేసులో ఆర్.కృష్ణయ్యకు నోటీసులు

232
Narsingi Police Notices to TDP MLA Krishnaiah ...
- Advertisement -

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటివరకు నయీం భూకబ్జాలు, పోలీసులతో లింకులపై దృష్టిసారించిన సిట్…తాజాగా నయీం పొలిటికల్ లింకులపై దృష్టిసారించింది. నయీంకు సహకరించిన వారిని విచారించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆర్‌.కృష్ణ‌య్య‌కు విచారణ నిమిత్తం పోలీసులు నోటీసులు అందించారు. దీంతో ఇవాళ నార్సింగ్ పోలీస్‌స్టేష‌న్‌లో పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయ‌న‌ను పోలీసులు దాదాపు గంట‌సేపు విచారించారు. న‌యీమ్‌తో కృష్ణ‌య్య‌కు ఉన్న సంబంధాలు, ప‌లు వివ‌రాల‌పై పోలీసులు ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది.

గతంలో గ్యాంగ్ స్టర్ నయీంతో ఉన్న సంబంధాలపై కృష్ణయ్య బహిరంగంగానే ప్రకటన చేశారు. నయీంతో తనకు సంబంధాలు ఉండేవని, అయితే అవి ఆర్థికపరమైనవి కావని, రాడికల్ యూనియన్‌లో పని చేసినప్పుడు సంబంధాలు ఉండేవని చెప్పారు. ప్రభుత్వం చర్యను సమర్థిస్తున్నా నయీం అరాచకాలు చేశారని, కాబట్టి ప్రభుత్వ చర్యను తాను సమర్థిస్తున్నానని చెప్పారు. అయితే దీని పైన సమగ్ర విచారణ జరపాలన్నారు.

నయీంను బెదిరించా తన వద్దకు రోజుకు బాధల్లో ఉన్నవారు చాలామంది వస్తారని, వారి తరఫున తాను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పని చేస్తానని చెప్పానన్నారు. అలాగే నయీం బాధితులు కూడా కొందరు తన వద్ద గోడును వెళ్లబోసుకున్నారని, వారి తరఫున నయీంకు ఫోన్ చేసి తిట్టానని చెప్పారు. అంతేగాదు తాను గతంలో భువనగిరి ఉర్సు, వినాయక ఉత్సవాలలో పాల్గొన్నానని చెప్పారు. ఉద్యమం సమయంలోనే నయీంతో సంబంధాలు ఉన్నాయన్నారు. కొద్ది నెలల క్రితం అతనితో మాట్లాడానని, ఇక నయీంని కలవక చాలా రోజులు అవుతోందన్నారు. సిట్ విచారణకు హాజరవుతానని ప్రకటించిన విధంగానే ఆయన ఇవాళ నార్సంగి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

- Advertisement -