రైతులతో చర్చలకు సిద్ధమే…!

48
tomar

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఏడు నెలలు దాటింది. రైతులు ఇంకా ఆందోళన కొనసాగిస్తుండగా వారితో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించింది కేంద్రం.

సాగు చట్టాల రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు సిద్ధమని వెల్లడించారు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌. రైతుల సంక్షేమం కోసం కేంద్రం రైతులతో మాట్లాడిందని, మళ్లీ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

బిల్లుల రద్దు కాకుండా ఇతర అంశాలపై చర్చించేందుకు రైతు సంఘాలు సిద్ధంగా ఉంటే.. వారితో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్థానంలో మరొకరిని నియమిస్తారనే వార్తలను కేంద్రమంత్రి తోసిపుచ్చారు. గతేడాది నవంబర్‌ నుంచి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు.