రేగుంటకు సీఎం కేసీఆర్‌..బాల్క సుమన్‌కు పరామర్శ

40
cm kcr

ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ఇటీవల ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి సురేశ్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్‌ని పరామర్శించనున్నారు కేసీఆర్. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుమార్గం ద్వారా సుమన్‌ స్వగ్రామమైన రేగుంటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సుమన్ ఇంటివద్ద ఉండనున్నారు. సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. సుమన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.